Telugu Samethalu


  • గోచికి లేక బాబు ఏడుస్తుంటే కొడుకు వచ్చి సఫారి సూట్ కావాలన్నడట.
  • గుర్రం నాడ దొరికిందని గుర్రం కొనమన్నాడట.
  • ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగరమన్నాడట.
  • మంచోడు మంచోడు అంటే మంచం ఎక్కి కురుచున్నాడట.
  • పోనీలే అని పాత చీర ఇస్తే మురలు ఏసింధట.
  • శుభం పలకరా పెండ్లి కొడుకా అంటే పెండ్లి కూతురు ముండ ఎక్కడ అన్నాడట.
  • అసలు లేదురా మొగుడ అంటే కోడికుర వండమన్నాడట.
  • గాడిదకి ఎం తెలుసు గంధం చెక్కల వాసన.
  • రామేశ్వరం పోయిన శనెశ్వరమ్ వదలనట్లు.
  • ఎక్స్‌టెన్షన్ కార్డ్ రాక ఎకరాలు అమ్ముకున్నారంట (పేకాట సామెత).
  • మొగుడు కొట్టాడు అని కాదు, తోడికోడలు నవ్వింది అని ఏదిచిందట వెనుకటికీ.
  • గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే ఉలిక్కి పడినట్లు.
  • కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలిక పోయినట్లు.
  • చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ము కొవటం.
  • ఎలక తోలు తెచ్చి ఎంతెంత ఉతికిన గాని నలుపు నలుపే గాని తెలుపు రాదు.
  • కుక్క కాటుకి చెప్పుధెబ్బ.
  • మా తాతలు నేతులు తాగారు, మా ముతులు వాసన చూడండి.
  • గజ్జీకి లేని దురద జాలిమ్ లోషన్ కు ఎందుకు.
  • పచ్చ కామార్లు వచ్చినోడికి లోకం అంత పచ్చగా కనిపిస్తుంది అంట.
  • రాను రాను రాజు గుర్రం గాడిద అయిందట.
  • అన్నం ఉడికిందని చెప్పటానికి ఒక మెతుకు చాలు.
  • మెరిసేధి అంత బంగారం కాదు.
  • దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.
  • ఆకు వాచీ ముల్లు మీద పడ్డ, ముల్లు పోయ్ ఆకు మీద పడ్డ బొక్క ఆకుకే.
  • చూసి ర అంటే కాల్చి వాచీండట వెనుకటికీ.
  • రామాయణం అంత విని రామునికి సీత ఏమవుతాది అని అడిగాడట.
  • ఇల్లు అలుకాగానే పండుగకాదు.
  • ఎవరు తీసిన గోతిలో వారే పాడుతారు.
  • ఇంట్లో పిల్లి వీధిలో పులి.
  • ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచింధీ.
  • ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, చూట్టకు నిప్పు కావాలన్నడట ఒక్కడు.
  • ఆంధితే జుట్టు అందకపోతే కాళ్ళు.
  • తులసి వనంలో గంజాయీ మొక్క.
  • మింగనీకి మెతుకులేదు కానీ, మీసాలకి సంపెంగ నూనె కావాలన్నడట.
  • కూసే గాడిద వాచీ మేసే గాడిదని చెడా కొట్తిందట.
  • కొండను తవివి ఎలుకను పట్టినట్లు.
  • ఉరిలో పెళ్ళికి కుక్కల హడావిదిన్నట్లు.
  • కాకి పిల్ల కాక్కి ముద్దు అన్నట్లు.
  • అత్త వల్ల దొంగతనం,  మొగుడి వల్ల   రoకుతనం నేర్చు కొన్నట్లు.
  • ఆంగట్లో అన్నీ వున్నాయి, అల్లుడి నోటిలో శని ఉంది.
  • అన్నం పెట్టితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగి పోతుంది, వాత పెడితే కలకాలం ఉంటుంది.
  • అయితే ఆదివారం లేకుంటే సోమవారం.
  • అర చేతిలోనే వైకుంఠం చూపుతారు.
  • ఆకలెస్తుంది అత్తా! అంటే, రోకలి మింగవే కోడల అన్నది ఆట.
  • ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుకమెరుగదు .
  • ఆయన ఉంటే తెల్ల చీర ఎందుకు.
  • ఆరు నెలలు స్నేహం చేస్తే, వీరు వారుఅవుతారు.
  • ఆలు లేదు, చూలులేదు, కొడుకు పేరు సోమలింగం.
  • అలువంక వారు ఆత్మ బంధువులు, తల్లి వంకవారు తగినవారు. తండ్రి వంకవారు దాయాధులు.
  • అవలిస్తే ప్రేగులు లెక్కపెట్టును.
  • అవుచేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా.
  • ఇంటి కన్నా గుడి పదిలం.
  • ఇల్లు చూచి ఇల్లాలును చూడమన్నట్లు.
  • ఈత చెట్టు క్రింద పాలు త్రాగినా కల్లే అంటారు.
  • ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయలేదు.
  • ఉరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది.
  • ఎంత చెట్టుకు అంత గాలి.
  • ఎద్దు తన్నునని బయపడి, గుర్రం చాటున దాగినడట.
  • ఎలుకకు పిల్లి సాక్షి.
  • ఎవడి వెర్రి వాడికి ఆనందం.
  • ఎవరు తవ్వు కొన్న గోతిలో వారే పడుతారు.
  • ఏకు అయి వచ్చి మేకు అయి బిగీసినది.
  • ఏ పుట్టలో ఏ పమువున్నదో ఎవరీకేరుక.
  • ఏ యెండకు కా గొడుగు పట్టాలి.
  • ఏరుకొని తినేవాని వెంట గీరుకోని తినేవాడు పడినట్లు.
  • ఒకరిద్దరిని చంపితే కానీ వైద్యుడు గాడు.
  • ఒక అబద్దం కమ్మడానికి వంద అబద్దాలు కావాలి.
  • గుడిని మింగేవాడు ఒకడు ఐతే గుడి లింగాన్ని మింగే వాడు ఇంకొకడు.
  • గుళ్ళో దేవుడికి నైవేద్యం లేకుంటే, పూజారి పులిహరకు ఏడ్చడటా.
  • చెనుకి గట్టు, వూరికి కట్టు ఉండవలెను.
  • చేసేది బీద కాపురం, వచ్చేది రాజరోగాలు.
  • తల్లి ఐన ఏడువనిధె పాలు ఇవ్వదు.
  • తల్లిని నమ్మినవాడు, ధరణిని నమ్మినవాడు చెడిపోరు.
  • తిడేతే చచ్చినవాడు, దివిస్తే బ్రతికినవాడు లేడు.
  • దున్న పోతూ మీద వాన పడినట్లు.
  • పంది ఎంత బలిసిన నందితో సమానమాగున.
  • పెండ్లి సందట్లో పుస్తేకట్టడం మరీచాడు.
  • రోలు పోయి మద్దెలతో మొర పెట్టుకున్నట్లు.
  • వనారకడ, ప్రాణం పోకడ ఎవరెరుగుదురు.
  • శాస్త్ర ప్రకారం చేస్తే, కుక్కపిల్లలు పుట్టినట్లు.
  • కొనబోతే కొరివి, అమ్మ బోతే అడవి.
  •  నిండు కుండా తొనకదు.
  • అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.
  •  కాకి ముక్కుకి దొండపండు.
  • తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు.
  •  తంతే బూరెల గంపలో పడినట్లు.

6 comments:

mohan said...

kundalo kudu alage undali pillodu matram lavuga vundali....

Deep said...

Excellent collection...


ఎంత చేసిన కూటికే....ఎన్నాళ్లు బ్రతికినా కాటికే..
Telugu Saamethalu, Telugu Proverbs, Saamethalu
Telugu Saamethalu, Telugu Proverbs, Saamethalu


Unknown said...

kathiki leni duradha kandhakendhuku

Unknown said...

munduundhi mussalla panduga

syamganesh said...

కంద కు లేని దురద కట్టిపీట కు ఉన్నట్టు

Unknown said...

Turpu tirigi dandam pettuko

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Lady Gaga, Salman Khan