Telugu Culture

తెలుగు కల్చర్. మన సంస్కృతి గొప్పదనం గురించి ఎంత చెప్పిన తక్కువే, దేశ భాషాలందు తెలుగుభాషా  గొప్పాధి అన్నాడు ఓ మహాకవి, మన చీర కట్టు గురించి, మన పెండ్లి సంప్రదాయలగురించి, మన పండగల గురించి ఎంత చెప్పిన తక్కువే.భారతజాతిలో తెలుగు వారికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడంలో తెలుగువారు ఉన్నతులు. దాతృత్వంలో అందరికంటె ముందువుంటారు. సాటి వారికి సాయపడడంలో వెనుకడారు.


తెలుగు వారి పండుగలు:--
1). ఉగాది- చైత్ర శుద్ద పాడ్యమి. 2). శ్రీరామ నవమి- చైత్ర శుద్ద నవమి. 3). అక్ష తదియ(అట్లతద్ది)- వైశాక శుద్ద తదియ. 4). గోకులాష్టమి- శ్రావణ బహుళ అష్టమి. 5). వినాయక చవితి- బాధ్రపద శుద్ద చవితి. 6). విజయదశమి(దసరా)- ఆశ్వయుజ శుద్ద దశమి. 7). బతుకమ్మ పండుగ- ఆశ్వయుజ శుద్ద దశమి 8). దీపావళి- ఆశ్వయుజ బహుళ అమావాస్య. 9). నాగుల చవితి- కార్తీక శుద్ద చవితి. 10). మకర సంక్రాంతి- బోగి కనుమ. 11). శివరాత్రి- మాఘ బహుళ చతుర్దసి. 12). రథ సప్తమి- మాఘ సుద్ద సప్తమి.

తెలుగు వివాహం లోని ముఖ్యమైన అంశాలు:--
1). పెళ్ళిచుపులు 2). నిశ్చయ తాంబూలాలు. 3). స్నాతకం. 4). కాశి యాత్ర. 5).వర పూజ-ఎదుర్కోల్లు. 6). గౌరీ పూజ. 7). మంగళ స్నానాలు. 8). కన్యా వర్ణం. 9). మధుపర్కాలు. 10). యజ్నోపావితాధారణ. 11). మహసంకల్పం. 12). కాళ్ళు కడగటం. 13). జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టటం. 14). కాళ్ళు తొక్కించడం. 15). కన్యాదానం. 16). స్వర్ణజలాభి మాత్రాణం. 17). యోక్త్ర బంధనం. 18). మంగళ సూత్రధారణ. 19). తలంబ్రాలు. 20). బ్రహ్మ ముడి. 21). ఉంగరాలు తీయడం. 22). సప్తపది-ఫాణీగ్రహణం. 23). ప్రధాన హోమం. 24). సన్నికల్లు తొక్కడం. 25). లాజా హోమం. 26). స్థాలిపాకం. 27). నాగవళ్లి. 28). సదస్యాం. 29). నల్లపూసలు కట్టడం. 30). అరుందతి దర్శనం. 31). ఉయ్యాల-బొమ్మని అప్పాచెప్పటం. 32). అంపకాలు. 33). గృహప్రవేశం.

ఎందుకు.....?

 వివాహంలో సరిగ్గా ముహూర్తం వేళకు   పురోహితుడు  జీలకర్ర, బెల్లం కలిపిన మిశ్రమాన్ని  వధూ వరూలిద్దరు ఒకరి తలమీద ఒకరు  ఉంచెలా చేస్తారు. శాస్త్రరీత్య ఈ 'గూడజీరక'  మిశ్రమానికి బ్రహ్మరంద్ర్రాన్ని తెరిపించే శక్తి  ఉంటుందట. అలా జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్దని తలల మీద పెట్టుకునే సమయంలో ఒకరి కళ్ళలోకి మరొకరు  చూసుకోవాలి. అలా చూసుకున్న సమయంలో వధువరులిద్దరికి ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలిగి , జీవితాంతం అన్యొన్యమ్గ కలిసి మెలసి ఉంటారట. అందుకే  జీలకర్ర, బెల్లాన్ని, ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచుతారు అని 'ధర్మాసింధూ' గ్రంథం చెబుతుంధీ.

దేవుని వద్ద కొబ్బరి కాయను కొట్టేది ఎందుకు...?


సర్వ దేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ, హొమదుల్లొను, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరి కాయను కొట్టడం తప్పని సరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకరానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడుతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలని ఉంచమని  అర్థం. స్రుస్టి మొత్తంలో  నీరున్న కాయ కొబ్బరి కాయే.



0 comments:

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Lady Gaga, Salman Khan