Sachin Tendulkar

సచిన్ టెండుల్కర్ ముంబాయి (పూర్వపు బొంబాయి) లోని సరస్వతి బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. తండ్రి రమేష్ మరాఠీ నవలా రచయిత. 1995 లో గుజరాత్ పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు అంజలిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. సారా (జననం అక్టోబర్ 12, 1997) మరియు అర్జున్ (జననం సెప్టెంబర్ 23, 1999).
ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (సచిన్ రమేశ్ టెండుల్కర్) . క్రికెట్ క్రీడకు భారతదేశం లో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. ఈనాడు భారత్ లో ఈ క్రీడకు ఇంత జనాదరణ ఉందంటే అదంతా సచిన్, అతని ఆట తీరే కారణం. 1990 దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయి కి చెందిన బ్యాట్స్‌మెన్ ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. 37 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ జట్టు విజయాలకై శాయశక్తుల ప్రయత్నిస్తూ వెన్నెముకలా నిలబడ్డాడు. 2002 లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియా కు చెందిన డాన్ బ్రాడ్‌మెన్ మరియు వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన వివియన్ రిచర్డ్స్ ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది. 2003 లో మళ్ళి తిరగరాసి వన్డే క్రికెట్ లో వివియన్ రిచర్డ్స్ కు రెండో స్థానంలోకి నెట్టి సచిన్ ను అగ్రస్థానంలో నిలబెట్టారు. అతని యొక్క ఆటతీరు, ఆట లోని నైపుణ్యం ఎంత చూసిననూ తనవి తీరదని అభిమానుల నమ్మకం. అతను అవుటైన వెంటనే టి.వి.లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. టెస్ట్ రికార్డులు చూసిననూ, వన్డే రికార్డులు చూసిననూ అడుగడుగునా అతని పేరే కన్పిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం.టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో అక్టోబర్ 17, 2008 న వెస్ట్‌ఇండీస్ కు చెందిన బ్రియాన్ లారా ను అధికమించి మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డు అతనిదే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ అని పిలువబడే సచిన్ 1989 లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. 1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చినాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్.. ఫిబ్రవరి 24, 2010 న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు సాధించి కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే డిసెంబర్ 19, 2010 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే క్రికెటర్ అందుకోని మైలురాయిని అధిరోహించాడు. 2012, మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో (వన్డేలు, టెస్టులు కలిపి) ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్తరికార్డు సృష్టించాడు.
గురువు రమాకాంత్ అచ్రేకర్ సలహాపై సచిన్ శారదాశ్రమ్ విద్యామందిర్ హైస్కూల్ హాజరైనాడు.పాఠశాల విద్యార్థిగా ప్రారంభ దినాలలో పేస్ బౌలింగ్ లో శిక్షణ కోసం మ్ర్ఫ్ పేస్ అకాడమీకి హాజరైననూ ఇంటికి పంపివేయబడ్డాడు. సచిన్ ను పంపిన మహానుభావుడు పాతతరపు ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ బ్యాటింగ్ పై దృష్టి సారించు అని ముక్తంగా చెప్పడం, అతని సలహాను సచిన్ పాటించడంతో నేటి ప్రపంచంలో మనం ఒక ప్రముఖ బ్యాట్స్‌మెన్ చూస్తున్నాం. సచిన్ యువకుడిగా ఉన్నప్పుడు కోచ్ వెంబడి గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయుటలో బోర్ అనిపించేది. అందుకు కోచ్ స్టంప్స్ పైన ఒక రూపాయి నాణేన్ని ఉంచి సచిన్ ను ఔట్ చేసిన బౌలర్ కు ఇచ్చేవాడు. సెషన్ మొత్తం సచిన్ ఔట్ కానిచో ఆ నాణెం సచిన్ కే దక్కేది. అలాంటి 13 నాణేలు ఇప్పటికీ సచిన్ వద్ద ఉన్నాయి.
పాఠశాలలో ఉన్నప్పుడు హరీష్ షీల్డ్ పోటీలో వినోద్ కాంబ్లీ తో కల్సి 1988 లో 644* పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్సులో సచిన్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాదించి 320 కి పైనా పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్ లో సచిన్ వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. హైదరాబాదు లో 2006 లో జర్గిన అండర్-13 మ్యాచ్ లో ఇద్దరు కుర్రాళ్ళు ఈ రికార్డును ఛేధించే వరకు 18 సం.ల పాటు సచిన్-కాంబ్లీ లదే రికార్డుగా కొనసాగింది.
1988/1989 లో అతని మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబాయి తరఫున ఆడుతూ గుజరాత్ పై 100* పరుగులు సాధించాడు. 15 సం.ల 232 రోజుల వయస్సులోనే ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించి ఆ ఘనతన సాధించిన యువ బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ లలో కూడా తను ఆడిన తొలి మ్యాచ్ లలోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.
టెండుల్కర్ వ్రాయడంలో ఎడమచేతి వాటం ఉపయోగించిననూ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో మాత్రం కుడిచేతినే ఉపయోగిస్తాడు. టెండుల్కర్ తన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ 1989 లో పాకిస్తాన్ పై ఆడి కేవలం 15 పరుగులకే వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. వకార్ కు కూడా ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఫైసలాబాద్ లో తన తొలి అర్థశతకం పూర్తిచేశాడు. డిసెంబర్ 18 న ఆడిన తన తొలి వన్డే మ్యాచ్ లో కూడా వకార్ యూనిస్ బౌలింగ్ లోనే డకౌట్ అయ్యాడు. పాకిస్తాన్ సీరీస్ తర్వాత న్యూజీలాండ్ టూర్ లో రెండో టెస్ట్ లో 88 పరుగులు సాధించాడు. 1990 ఆగష్టు లో ఇంగ్లాండు లోని ఓల్డ్ ట్రఫర్డ్ లో జర్గిన మ్యాచ్ లో తన తొలి శతకం సాధించాడు. 1991-1992 లో ఆస్ట్రేలియా టూర్ లో ప్రపంచ శ్రేణి బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. షేన్‌వార్న్ టెస్ట్ మ్యాచ్ లో రంగప్రవేశం చేసిన సిడ్నీ మ్యాచ్ లో 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత పెర్త్ మ్యాచ్ లో మరో సెంచరీ సాధించాడు. టెండుల్కర్ ప్రతిభ 1994-1999 సంవత్సరాలలో ఉన్నత శిఖరాలకు చేరింది. 1994 లో ఆక్లాండ్ టెస్ట్ లో టెండుల్కర్‌ను ఓపెనర్‌గా పంపించారు.. ఆ టెస్టులో 49 బంతుల్లోనే 82 పరుగులను సాధించాడు. అతని తొలి వన్డే సెంచరీ సెప్టెంబర్ 27 , 1994 లో ఆస్ట్రేలియాపై సాధించాడు. తొలి వన్డే శతకానికి 79 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది.
అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డు : డిసెంబర్ 10, 2005 న ఢిల్లీ లోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శ్రీలంక పై ఆడుతూ 35 వ టెస్ట్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. దీంతో ఇది వరకు సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 34 టెస్ట్ సెంచరీల రికార్డును విచ్ఛిన్నమైంది.

సచిన్ టెండూల్కర్ లా ఆలోచిస్తే ఇంతటి విధ్వంసాలు జరుగుతాయా?

సచిన్ ఆట గురించి మనకు తెలుసు. క్రింది సంఘటన చూస్తే మన ప్రవర్తనతో ఎదుటివారి మనసులను ఎలా గెలుచుకోవచ్చో తెలుస్తుంది.

ఆ మధ్య ముంబాయిలో ఒక కొత్త ఇల్లు కట్టుకొన్నాడు. అతను అలా కట్టుకోవడం వలన తమ ప్రాంతంలో ఇళ్ళ ధరలు పెరిగాయని ,సచిన్ అంతటివాడు తమ మధ్యకు వస్తున్నాడని అందరూ ఆనందించారు. కాని సచిన్ ఇల్లు కట్టుకొనేప్పుడు ఎదుటివారికి కలిగే అసౌకర్యం గురించి ఎంత ఆలోచించాడంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటి వారికీ స్వయంగా ఉత్తరాలు వ్రాశాడు. ఆ ఉత్తరం లోని విషయం ఇది.

" నేను మీ ప్రాంతములో ఇల్లు కట్టుకొంటున్నాను. అది పెద్ద ఇల్లు. ఈ ఇంటి నిర్మాణమప్పుడు ఎన్నో లారీలు పగలు,రాత్రీ తిరగవలసి వస్తుంది. ఇంకా ఇంటి నిర్మాణంలో బండలు పగలగొట్టవలసి వస్తుంది. చిన్నచిన్న డైనమెట్లు కూడా అందుకు ఉపయోగించవలసి వస్తుంది. ఎవరికీ దెబ్బలు తగులకుండా ఏర్పాటుచేసాము. కాని శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. పగలురాత్రీ అని తేడా లేకుండా పని చేయాల్సి ఉండడం వలన మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. నన్ను మన్నించగలరు. ఈ ప్రాంతంలోకి నేను చేరిన తర్వాత నేను మీ కాలనీ అనే కుటుంబంలో ఒక సభ్యుడను అవుతాను కదా.

ఒక కుటుంబములో ఒక కొత్త సభ్యుడు రావడం అనేది ఒక తల్లికి బిడ్డ పుట్టడం లాంటిది. తల్లి నవమాసాలూ మోసేటప్పుడు చాలా కష్టాలు పడవలసి వస్తుంది. అప్పుడే బిడ్డ రాగలడు. అలానే మీ కాలనీ అనే కుటుంబములోనికి నేను కొత్తగా వస్తున్నాను కాబట్టి అందుకు మీరు కొంత కష్టం పడవలసిఉంటుంది అని తెలుపడానికి బాధపడుతున్నాను.. నన్ను మీ కుటుంబములోనికి చేర్చుకుంటారని ఆశిస్తున్నాను."

అసలు సచిన్ రావడమే తమకు ఎంతో గొప్పగా, ఆనందముగా భావించారు ఆ ప్రాంతవాసులు. ఐనా వారు ఏమీ అనలేదని సచిన్ ఊరుకోలేదు. వారి అసౌకర్యం ఊహించి ఎంత గొప్పగా వ్రాశాడో కదా.

ఇలా ఎదుటివారికి కలిగే బాధను మన విధ్వంసకారులూ (చీటికీమాటికీ ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులను తగులబెడుతున్నవారు) తెలుసుకొంటే బాగుంటుంది కదా

0 comments:

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Lady Gaga, Salman Khan