Savithri

కొమ్మారెడ్డి.సావిత్రి లేదా సావిత్రి.కొమ్మారెడ్డి  6 th డిసెంబర్ 1935 లో జన్మించినారు.  సావిత్రి గారు తెలుగు సినిమా గొప్ప నటీమణి. ఇంకా డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ గా  కూడా చేశారు. సావిత్రిగారు తన చిన్నతనంలో సంగీతం మరియు క్లాసికల్ నృత్యం నేర్చుకున్నారు. ఇంకా చిన్నప్పటి నుండే ఎన్నో స్టేజ్ షోస్ కూడా చేశారు. చిన్నప్పటి నుండే సావిత్రి గారికి నటన అంటే ప్రాణం.
1950 లో సంసారం అనే సినిమాతో పరిచయం అయ్యారు. సావిత్రి గారు తెలుగు, తమిళ్, కన్నడ మరియు హింది బాషలలో మొత్తం 318 సినిమాలు చేశారు.
1960 లో చివరకు మిగిలేది అనే సినిమాకు ఉత్తమ నటనకు "రాష్ట్రపతి అవార్డ్" వచ్చినది. నటశిరోమణి అనే బిరుదును ఇచ్చి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సత్కరించినది.సావిత్రి గారు తెలుగులో 'చిన్నారి పాపలు' , 'చిరంజీవి', 'మాతృదేవత' మరియు 'వింత సంసారం' అనే సినిమాలను డైరెక్ట్ చేశారు. సావిత్రి గారు 1953 లో జెమినీ. గణేశన్ గారిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు 'విజయ చాముండేశ్వరి', 'సతీష్ కుమార్'. అనుకోకుండా సావిత్రి గారి వివాహ జీవితం సరిగా సాగలేదు, భర్తను చాలా నమ్మెది కానీ తను సరిగా పట్టించుకొనేవాడుకాడు. దానితో సావిత్రి గారు షాక్ గురిఅయి డిప్రెషన్ లోకి వెళ్లినారు. అంత పెద్ద ఇంట్లో ఇద్దరు పిల్లలతో కలిసి జీవించడం భాధగా ఉండేది. తరువాత సావిత్రి గారికి మనశులమీద నమ్మకం పోయింది, నెమ్మదిగా స్లీపింగ్ పిల్స్, అల్కోహాల్, డ్రగ్స్ తీసుకోవడం అలవాటు అయింది. చెడు అలవాట్లు వలన ఆకలి తగ్గిపోయి బాడీ లో విశపూరితమయనా పదార్థాలు పెరిగిపోయి, చాలా సార్లు హోస్పటిల్ పాలు అయినారు. సావిత్రి గారు 26 th డిసెంబర్ 1981 రోజున మరణించినారు.  తెలుగు సినిమా మరిచిపోలేని గొప్ప నటీమణి సావిత్రిగారు.

1 comments:

Anonymous said...

Mahanati

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Lady Gaga, Salman Khan